పెద్దయ్య హితవు:- --గద్వాల సోమన్న, 9966414580
మంచిలేని జీవితము
ఎంచి చూడ వ్యర్థము
కొంచెమైనా మంచిని
కల్గియున్న గౌరవము

నవ్వులేని ముఖములు
పువ్వులు లేని వనములు
నూనె లేని దివ్వెలు
వానలేని ప్రాంతములు

క్రియ లేని విశ్వాసము
చూడ నిష్ప్రయోజనము
పెట్టితే గాలిలోన 
వెలుగుతుందా! దీపము

శ్రమిస్తేనే ఫలితము
అక్షరాల సత్యము
మితిమీరిన బద్ధకము
వైరితో సమానము


కామెంట్‌లు