హితవు:- --గద్వాల సోమన్న, 9966414580
నాటుకున్న మొక్కలు
జగతిలోన మిత్రులు
ఎంతైనా లాభము
బ్రతుకులోన క్షేమము

మింటిలోన చుక్కలు
ఇంటిలోన పిల్లలు
సందడికి వారసులు
వారితో కళకళలు

సదనంలో  మహిళలు
గుబాళించు పువ్వులు
వెలుగులీను దివ్వెలు
సొగసులీను నవ్వులు

వసుధలోన వృద్ధులు
గౌరవానికర్హులు
చేయాలోయ్ మానక
అహర్నిశలు సేవలు


కామెంట్‌లు