అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు ధర్మాపురం. ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, ఆ ఇద్దరి పేరు రవి నరేష్. రవి పేదవాడు నరేష్ ధనవంతుడు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఊర్లో ఉన్న పాఠశాలలో చదువుతున్నారు, ఒక రోజు వారి పాఠశాల నుంచి విదేశీయాత్రకు తీసుకు వెళ్తున్నాము. రావాలి అనుకున్న వాళ్లు మనిషికి 500 రూపాయలు చొప్పున డబ్బులు కట్టాలి అని చెప్పారు పాఠశాల ఉపాధ్యాయులు. ఆ మాట విని రవి చాలా బాధపడతాడు, అతని దగ్గర అంత డబ్బు లేదు వాళ్ళింట్లో ఆడుగుదాము అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాలేదు. నరేష్ రవిని హేళన చేస్తాడు రవి చాలా బాధపడతాడు. ఆ రోజు నుంచి నరేష్ రవితో మాట్లాడటం లేదు. ఒకసారి రవి నరేష్ ఇంకా కొంతమంది స్నేహితులు కలిసి పాఠశాలకు నడిచి వెళుతున్నారు. అప్పుడు నరేష్ అనుకోకుండా కిందపడ్డాడు. అందరూ అతన్ని చూసి నవ్వుతారు కానీ ఎవరు అతనికి సహాయం చేయరు. రవి నరేష్ ని పైకి లేపి, అతని పుస్తకాల సంచిని రవి పట్టుకుని నరేష్ నీకు ఏమైనా దెబ్బలు తగిలాయ అని అడుగుతాడు. నరేష్ వెంటనే ఆలోచించుకుంటాడు. నేను కింద పడ్డప్పుడు చూసినటువంటి వారు ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను చూడకుండా నవ్వుతూ పోయారు, నేను అవమానించిన రవి ఒక్కడే నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేశాడు. రవి పట్ల నేను చాలా హీనంగా ప్రవర్తించాను అనుకొని, వెంటనే రవితో నరేష్ నన్ను క్షమించు రవి అని అడుగుతాడు. సరేలే నరేష్ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అదే చాలు నాకు అంటాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి మెలిసి గురుకుల సహాయం చేసుకుంటూ రోజు బడికి పోతుంటారు.
నీతి :- ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు, చూడొద్దు
నీతి :- ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు, చూడొద్దు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి