మంచి స్నేహితులు :- ఎస్. శివాని,- 9వ తరగతి, -జి. ప. ఉ. పా. అయిటిపాముల, - నల్లగొండ.
 ఒక ఊరిలో భాను జాను అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు, భాను ధనవంతురాలు, జాను చాలా పేద అమ్మాయి, కానీ ఆటలు చాలాబాగా ఆడేది. ఒకరోజు భాను జాను బడికి పోతుండగా దారిలో ఒక అమ్మాయి కనిపించింది, మీరు ఎవరు అని అడిగితే, నేను ఒక పేద ఇంటి నుంచి పారిపోయి వచ్చాను,  నాకు కొంత ఆశ్రయం ఇస్తారా అని అడుగుతుంది. మా ఇంటికి రా నీకు నేను ఆశ్రయం  ఇస్తాను అని జాను అంటుంది. కాదు మా ఇంటికి రా అని భాను అంటుంది. అమ్మాయి ఎవరి ఇంటికి వెళ్లాలి అని ఆలోచిస్తుంది. భాను జాను గొడవ పడుతుండగా అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది. ఏమైంది పిల్లలు గొడవ పడ్తున్నారు అని అడుగుతుంది. జాను ఇంతకు ముందు జరిగిన విషయం మొత్తం చెపుతుంది. ఓ ఇదా పరిస్థితి అయితే నేను ఒక ఉపాయం చెబుతాను చేస్తారా అని అన్నది ముసలావిడ. సరే అన్నారు భాను జాను, కానీ మీరు బడికి పోతే ఈ అమ్మాయిని నేను తీసుకువెళ్తాను సరేనా అన్నది ముసలావిడ, వాళ్ళిద్దరిలో కోపం మొదలైంది, మా ఇద్దరికి కాకుండా ఈ ముసలమ్మ ఏందీ ఇలా అంటుంది అనుకున్నారు. వెంటనే మీ ఇద్దరికి కలిపి ఒక పందెం పెడతాను. ఆ పందెం ఏంటంటే పరుగు పందెం,  మీరు గానీ అర సెకనులో మీ బడికి చేరుకోవాలని పందెం పెడుతుంది. వాళ్ళు ఒప్పుకుoటారు. కానీ వాళ్ల బడి నాలుగు కిలోమీటర్లు దూరం ఉంటుంది. అరె సెకండ్ లో ఎలా వెళ్లాలి అని అవ్వని ఇద్దరు ప్రశ్నించారు. అవ్వ అన్నది కదా మీరు పందెం ఎందుకు ఒప్పుకున్నారు, ఒప్పుకున్నంక వెనుకకు పోకుండా దానిని పాటించాలి అని ముసలమ్మ అన్నది. ఇచ్చిన మాట తప్పడం నీతి కాదు అని వారితో అన్నది ముసలమ్మ. జాను నేను వెళ్ళిపోతాను,  ఆ అమ్మాయిని తనకి ఇచ్చేయండి అన్నది. ఇగ ఆ పందెం లో భాను గెలుస్తుంది కానీ తనలోపల ఏదో కొంత బాధ ఉన్నది. తరువాత జాను దగ్గరకు భాను పోయి,  నువ్వెందుకు పోటీలో పాల్గొనలేదు అని భాను జానును అడిగింది.  అప్పుడు జాను  భానుతో,  నేను పోటీలో పాల్గొంటే నువ్వు ఓడిపోతావేమోనని నాకు అనిపించింది. ఎందుకంటే నేను స్కూల్ అన్ని ఆటల్లో  ఫస్ట్ కనుక. నువ్వు ఓడిపోతే నేను చూడలేను, అందుకే అలా చేశాను. వెంటనే భాను కళ్ళ ల్లో నీళ్లు తెచ్చుకొని జానును చాలా ఆప్యాయతగా  హత్తుకుంది. అప్పటినుండి వాళ్ళు ఇంకా దగ్గరి మిత్రులు అయిపోయారు. ఆ రోజు నుండి ఎక్కడైనా అనాధ పిల్లలు కనిపిస్తే దానం చేస్తారు కానీ, ఎన్నడు గొడవ పడలేదు. ఇదే అసలైన స్నేహం కదా.

నీతి :- ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైన స్నేహము

కామెంట్‌లు