స్ఫూర్తిదాతలు...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 
సాస్ కింగ్ గా పేరుగాంచిన విరాజ్ బెహల్ అమ్మానాన్నలు వ్యాపారం చేసేవారు కానీ వీరాజిని చదువుకోమని సింగపూర్ పంపారు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివాడు మర్చంట్ నేవీలో పనిచేశాడు ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలో ప్రయోగాలు మొదలుపెట్టి రెండుసార్లు పెట్టుబడి కూడా పోగొట్టుకున్నాడు పాకెట్ ఫుల్ అనే రెస్టారెంట్లో ప్రారంభించి సొంతంగా సాస్లు తయారు చేయడం మొదలుపెట్టాడు కానీ వ్యాపారంలో నష్టం వచ్చింది 2013లో వీబా అనే పేరుతో రాజస్థాన్లో కెచప్ ప్రారంభించాడు ఆర్డర్ల కోసం రెస్టారెంట్ల చుట్టూ తిరిగేవాడు ఆ తరువాత దీపక్ అనే స్నేహితుడి పెట్టుబడితో 70 టన్నుల కెచప్ ఆర్డర్ పొందాడు అప్పటినుంచి అతని సాసులు బర్కరు వెస్ట్రన్ ఫుడ్ లో మన భారతీయ మసాలాలు కలిపి రకరకాల ప్రయోగాలతో నేడు సాస్ కింగ్ అని ప్రసిద్ధి పొందాడు 700 నగరాల్లో 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు ఇప్పుడుబెంగుళూరు కి చెందిన రేణుక ఆరాధ్య ఇప్పుడు 6 00 క్యాబులకు యజమాని ఒకప్పుడు పూటకు తిండి లేక ఫస్టు ఉండిన జీవితం తండ్రి స్థానిక చిన్న గుడిలో పూజారి ఆయన భోజనం కోసం ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసేవాడు తండ్రి తో పాటు రేణుక అనే కుర్రాడు 12 ఏళ్ళకి ఒక ఇంట్లో పనికి కుదిరాడు వాళ్ళు సరిగ్గా తిండి పెట్టేవారు కాదు పాపము ఆకలికి మార్కెట్లో కుళ్ళిపోయిన అరటి పళ్ళు అవి తెచ్చుకుని తినేవాడు తండ్రి చనిపోవడం టెన్త్ క్లాసు ఫెయిల్ అవ్వటంతో ఇతను బెంగళూరు కి తల్లి అక్క తో వచ్చి చిన్నచితకా  ఉద్యోగాలు చేశాడు సెక్యూరిటీ గార్డ్ గా డ్రైవింగ్ నేర్చుకుంటూ ఆపై క్యాబ్ డ్రైవర్ గా పనిలో కుదురుకున్నాడు శవాల నీ తన క్యాబ్లో వారి ఊర్లకు చేర్చేవాడు తను ఒక క్యాబ్ కంపెనీ పెట్టాలని ఆలోచనతో ఒక కారు కొన్నాడు ప్రస్తుతం ప్రవాసి క్యాబ్స్  యజమానిగా పేరు డబ్బు సంపాదించాడు.ఓనర్ కమ్ డ్రైవర్ పేరుతో స్కీమ్ ప్రారంభించిన అతను50వేల రూపాయలు కట్టినవారికి కొత్త కారు ఇస్తాడు.వాళ్లు 3ఏళ్లు ఈఎంఐ చెల్లించాలి.అలా 300మందికి సాయం జేసిన రేణుకా ఆరాధ్య మనందరికీ స్ఫూర్తిదాత కదూ?🌹

కామెంట్‌లు