చదువు చిన్నారులను
చిదిమేస్తుంది!
చదువు చిన్నారులను
గాయం చేస్తుంది!!
చదువు బాల్యమును
మాయం చేస్తుంది.!!
భయమేస్తుంది
చదువు అంటే చిన్నారులకు
భయమేస్తుంది!!
ఎవరో పన్నిన కుట్రలో
చిన్నారులను చదువు చంపేస్తుంది!!
చదువు అంటే అమ్మలా నాన్నలా ఉండాలి
చదువు అంటే ఆటలా పాటలా మాటలా ఉండాలి.
చదువు అంటే తీయని మిఠాయి లా ఉండాలి.
చదువు అంటే కష్టంగా కాదు ఇష్టంగా ఉండాలి
చదువు అంటే పుస్తకాలు మెదళ్లు కాదు
చదువు అంటే కదల్లా బామ్మ చెప్పే కథల్లా ఉండాలి.
చదువు అంటే పనిలా- పనికొచ్చే పనుల్లా ఉండాలి.
చదువు అంటే బ్రతికించే- బ్రతికు దెరువు చూపించే లా ఉండాలి.
ఎవరో పన్నిన కుట్రలో
చిన్నారులకు చదువు అంటే భయమేస్తుంది.
బడి అంటే బలిపీఠం కాదు
బడి అంటే భయం కాదు
బడి అంటే అమ్మ ఒడి.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి