సాహితీ కవి కళాపీఠం,
సాహితీ కెరటాలు,
=============
ప్రపంచాన్నంతా ఒక తక్కిట,
తూకం వేస్తా... అనుబంధాలను కొలవమంటే!
నవమాసాలను మోసే తల్లికి బరువు భారమానుకుంటే,
పుట్టుక ఉంటుందా — ఈ పృథ్విలో?
రాలిపోయే ఆకులే,
తరువుకు భారమైన వేళ,
మరల పల్లవించదా, కొంగోత్త ఆశల చిగుర్లతో..!
నా ఊపిరే భారమైన వేళ...
తెరిచేయక తప్పలేదు,
నా హృదయ గవాక్షపు ద్వారాల్ని,
తలపులశ్వాలకు కళ్ళెం వేయటానికి..!
తలపుల తాకిళ్లతో...
నా ఊహల లాగానే..!
కలలన్నీ రాలిపోయిన నిర్మలమైన ఆకాశంలా,
చేతులు దులుపుకోవడం కుదురుతుందా?
సమస్యలెప్పుడూ సవతులే,
బ్రతుకుయనే భాగస్వామిని,
తల మీద మోస్తున్న సంవత్సరాల బరువుని,
దబ్బున కిందపడేసి పోవడం సాధ్యమేనా?
అక్షరాలు బరువని పుస్తకాలు అనుకుంటే,
ఇన్ని ఉద్గ్రంధాలు అబ్బురపరిచేవా..?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి