భావాలు తెలుపనా
ఊహలు లేపనా
రాగాలు తీయనా
నవరసాలు త్రాగించనా
అందాలు చూపనా
ఆనందాలు పంచనా
మనసులు తట్టనా
హృదులు ముట్టనా
కలమును పట్టనా
పుటలను నింపనా
అక్షరాలు అల్లనా
పదాలు పేర్చనా
మొక్కలు నాటనా
తోటను పెంచనా
పువ్వులు పూయించనా
పరిమళాలు వెదజల్లనా
తేనెచుక్కలు చల్లనా
తీయదనాలు అందించనా
కవితలు పాడనా
కమ్మదనాలు కలిగించనా
నవ్వులు చిందించనా
మోములు వెలిగించనా
వెన్నెల వెదజల్లనా
ఒయ్యారాలు ఒలికించనా
కలలోకి రానా
కవ్వించి పోనా
కల్పనలు చేయనా
భ్రమలు కొలపనా
హితాలు చెప్పనా
శుభాలు చెయ్యనా
లక్ష్యాలు ఏర్పరచనా
ముందుకు నడిపించనా
అక్షరశిల్పాలు చెక్కనా
రంగులబొమ్మలు గీయనా
పదప్రయోగాలు చెయ్యనా
విషయాలు వివరించనా
నోర్లు తెరిపించనా
కడుపులు నింపనా
పాటలు పాడనా
వీనులకు విందివ్వనా
వాణిని పూజించనా
వాక్కులు ఇమ్మననా
సాహితిని పిలవనా
లోకాన్ని మెప్పించనా
అచ్చతెలుగు వాడనా
తేటతెలుగు పలకనా
అంధ్రామృతము ఇవ్వనా
తెనుగుభాషకు వెలుగులద్దనా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నామది విప్పనా!
భావాలు తెలుపనా
ఊహలు లేపనా
రాగాలు తీయనా
నవరసాలు త్రాగించనా
అందాలు చూపనా
ఆనందాలు పంచనా
మనసులు తట్టనా
హృదులు ముట్టనా
కలమును పట్టనా
పుటలను నింపనా
అక్షరాలు అల్లనా
పదాలు పేర్చనా
మొక్కలు నాటనా
తోటను పెంచనా
పువ్వులు పూయించనా
పరిమళాలు వెదజల్లనా
తేనెచుక్కలు చల్లనా
తీయదనాలు అందించనా
కవితలు పాడనా
కమ్మదనాలు కలిగించనా
నవ్వులు చిందించనా
మోములు వెలిగించనా
వెన్నెల వెదజల్లనా
ఒయ్యారాలు ఒలికించనా
కలలోకి రానా
కవ్వించి పోనా
కల్పనలు చేయనా
భ్రమలు కొలపనా
హితాలు చెప్పనా
శుభాలు చెయ్యనా
లక్ష్యాలు ఏర్పరచనా
ముందుకు నడిపించనా
అక్షరశిల్పాలు చెక్కనా
రంగులబొమ్మలు గీయనా
పదప్రయోగాలు చెయ్యనా
విషయాలు వివరించనా
నోర్లు తెరిపించనా
కడుపులు నింపనా
పాటలు పాడనా
వీనులకు విందివ్వనా
వాణిని పూజించనా
వాక్కులు ఇమ్మననా
సాహితిని పిలవనా
లోకాన్ని మెప్పించనా
అచ్చతెలుగు వాడనా
తేటతెలుగు పలకనా
అంధ్రామృతము ఇవ్వనా
తెనుగుభాషకు వెలుగులద్దనా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి