సుప్రభాత కవిత : - బృంద
వేచిన కంటికి వేడుకగా
కాగిన మదికి వెన్నెలగా 
దాగిన ఆశల మొలకలా 
నోచిన నోముల ఫలములా...

వగచిన వ్యధకు వరంలా 
తలచిన తలుపుల రూపంలా 
తగిలిన గాయానికి  మందులా 
మిగిలిన బ్రతుకున పండుగలా

వెచ్చని కాంతుల ధారగా 
పచ్చని వెలుగుల పంటగా
ముచ్చట గోలిపే తీరుగా
వచ్చెను అదిగో వేకువ!

ముసిరే కమ్మటి మాయగా 
విరిసే పువ్వుల నవ్వుగా 
కురిసే మకరందపు తీపిలా 
మురిసే మనసే హాయిగా!

ఇనుడితో ఇలకు నెయ్యంలా
ఇడుముల బాపే  ధైర్యంలా
ఇష్టం తెలిసిన దైవంలా
నిత్యం వచ్చే ఆత్మీయునికి

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు