పల్లవి :-
గ్రామ గ్రామాలలో వెలసి వివిధ నామములతో పూజలందే తల్లి...
బోనాలతో నీకు ఉత్సవము జేసేము... చల్లంగ చూడు మా యమ్మ!
మమ్ము చల్లంగ చూడు మా తల్లి..!!
"గ్రామ గ్రామాలలో....."
చరణం :-
పసుపు,కుంకుమలతో పూలతో,పండ్లతో భక్తితో ఘటములను నింపి...
నీ కడకు శ్రద్ధతో వచ్చెదము తల్లి...,
నీ పాదములచెంత నా బోనాలనుంచి...మొక్కు లను చెల్లింతుమమ్మ , నీ కృపను అర్థించి మొక్కుదుము తల్లి..!
" గ్రామ ,గ్రామాలలో..."
చరణం :
ఆంధ్రలో...ఘటముల తో...సిరిమాను ఉత్సవము ఘనముగా చేతుమోయమ్మ...
తెలం గాణమున బోనాల కోలాహలముల జాతరనే చేతురో తల్లి...!
ఎవరేరీతి కొలిచినా ...
నీ బిడ్డలమే అందరము కరుణించి కాపాడు మమ్మ
మమ్ము కరుణించి కాపాడు మమ్మ !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి