జీవితమే ఓ చందమామ :- డా. మంజుప్రీతం కుంటముక్కల -మదనపల్లె
సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు 
===============
జీవితం ఒక చందమామవై మెరిసిందేమో,
వెన్నెలవై ఆశల విత్తనాలు చల్లిందేమో.
కొన్నిసార్లు నిండుగా వెలుగుతు పరవశంగా,
కొన్నిసార్లు నిశ్శబ్దంగా చెంగుమెత్తే ఛాయగా.

చీకటిలో దారిని చూపే తోడు అయి,
నమ్మకాన్ని నింపే ఓ మృదుల హస్తమయి.
మేఘాల వెనుక దాగినా కనపడకపోయినా,
ఉనికిని మరువని ఓ నిశ్శబ్ద జ్ఞాపికవైనా.

పూర్ణిమ వెన్నెలలా మురిసే క్షణాలు,
అమావాస్య నీడలా దిగులేసే కాలాలు.
రాత్రికి శాంతి, మనసుకు కాంతి,
జ్ఞాపకాల తడిలో తళుకుతున్న గాధ.

కాలం తారుమారు అయినా నిలిచే వెలుగు,
ప్రతి క్షణం కొత్త అర్థాల సందేశవెలుగు.
నక్షత్రాల మధ్య ఒక వెలుగురేఖవై,
ఆత్మ ప్రతిబింబం, మనో నైజానికి ప్రతిరూపమై.

బంధాల బాటలో అనుభవాల సాగరమే,
జీవిత యాత్రలో మార్గదర్శక దీపమే.
చందమామగా జీవితం వెలిగితే,
ప్రతి అడుగూ కవిత్వంగా విరిసిపోతే.

పరవశించే జీవితమే చందమామ 
అవునేమో ! అంటూ అక్షరాలు కురిశాయి ఈ పూట ఇలా…!


కామెంట్‌లు