కూటికే...గూటికే...?:- కవి రత్నసాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి, అత్తాపూర్ హైదరాబాద్
లక్షలు కోట్లు సంపాదించినా...
కష్టపడి కోటి విద్యలు నేర్చినా...
చివరికి అవన్నీ…కేవలం కూటికే..!

సమస్యలు సునామిలా 
ముంచుకొచ్చినా...ఎంతటి వారైనా
ఎదురీదవలసిందే…ఏటికే..!

ఏ పక్షి ఎంత ఎత్తులో ఎగిరినా...
చీకటి పడి పడగానే
తిరిగి చేరుకునేది…తన గూటికే..!

పుష్టికరమైన ఆహారం పుచ్చుకొని...
రోగాలు లేక దీర్ఘాయుష్మంతుడైనా...
కన్నుమూసి కడకు చేరవలసింది…కాటికే..!

కామెంట్‌లు