సుద్ధ ముక్క. :- అరుణ బట్టువార్. -జడ్పీహెచ్ఎస్ .ఇంద్రవెల్లి.
సుద్ధ ముక్క వేలెడు పొడువే అయినా
చేసే పనులు మాత్రం బోలెడు. 

ఉదయాన్నే ముస్తాబై.. 
ఉపాధ్యాయుల చేతికి నేస్తమై. 
అరచేతిని ఆటలాడిస్తూ.
రకరకాల మలుపులు తిరుగుతూ 
బొటన చూపుడు వేళ్ళ మధ్య దూకేస్తూ

నల్ల బల్ల పై తెల్లని  సుందర
అక్షరాలుగా రూపుదిద్దుకొని.
మంచు ముత్యాల లాగా
  గుండ్రని అక్షర కూర్పుతో
తన అస్తిత్వాన్ని ప్రాశస్త్యాన్ని
తెలియ పరచుకుంటుంది. . 

త్రిభుజాలు లంబకోణాలు. 
రాంబస్లు సమాంతర రేఖలు. 
ఆల్ఫా, బీటా ,గామాలు.
ఎన్నెన్నో రూపాలు. 
ఎన్నెన్నో ఆకారాలకు రూపాలు ఇచ్చి
విద్యార్థుల మదినే దోచే.
ఉపాధ్యాయుల చేతికి గొప్ప ఆయుధం.
తాను లేనిదే చదువే లేదు. 
బాలల భవితకు దారేలేదు. 

ఒక్కొక్కరి హస్తంతో ఒక్కో రూపం. 
సంధులు  సమాసాలు. 
 ఈక్వేషన్లు  కొటేషన్లు . 
కర్కట రేఖలు మకర రేఖలు. 
పాలపుంతలు గ్రహాల
  కూటము ఇలా .
హైడ్రా చలనాలు అమీబా మార్పులు. ఇలా ఇలా. ... 
అలవికాని రూపాలెన్నో? 

గురువుల కరకమలములతో
ఎన్నో  ఆకారాలకు రూపమిస్తూ
తాను నిత్యం కరుగుతూ
 
తన రూపం మారుతున్నా
దేహం తరిస్తున్నా. .
చిరునవ్వుతో క్షీణిస్తుంది. 
చిన్నారుల మదికి పునాదులు. 
వేస్తున్నానని మురుస్తుంది. 

తను లేనిది బోధనే లేదు. 
బాలల భవితకు మార్గం లేదు. 
ఎంత గొప్ప వారైతే నేమి? 
తన రాతల గీతల ద్వారా
   నేర్చుకున్న వారలే. 

బాలల బంగరు భవిత కుమార్గ దర్శి. 
అందులోనే ఆనందం పొందే.
అల్పసంతోషి. 

మిల మిల తాను మెరుస్తూ
 విద్యార్థు అందరినీ ఆకర్షిస్తూ
పరుగులు పెడుతూ పోటీలే
    పడుతూ తన కొరకు ప్రధానోపాధ్యాయుల గదికి
  పరుగులు పెట్టిస్తుంది.

చిన్ని సుద్ద ముక్కే అయినా
చిత్రాలెన్నో చేస్తుంది..
పిల్లల సుందర వందనాల్లో
పున్నమి వెలుగులు చూస్తోంది. 

చిట్టి శుద్ధముక్కవే అయినా
ఎంతటి పరోపకారివే నీవు. 

నిన్ను చూసి నేర్చుకోవాలంటోంది మామది. 
నేర్చుకోవాల్సింది కూడా ఎంతైనా ఉందండి. 


కామెంట్‌లు