ఎముకల గూడును నిర్మించిన
అమ్మకు
పక్షి గూడును నిర్మించడం ఓ లేక్కా!!?
నందిని నడివీధిలో బంధించగలమేమో
కానీ గాలిని బంధించగలమా!?
అది అమ్మ పని.!!
నీటిని బంధించిన సముద్రమామే
చంద్రునితో యుద్ధం చేస్తుంది!
శ్వేత సౌధం లా ఒక సౌందర్యం
తాజ్ మహల్ లా ఒక మందిరం
మానస సరోవరం ఒక స్వర్గం ఆమె!!
వర్తమానం ఒక యుగం కాదా
వర్షాన్ని ఆకర్షించిన ఆమె యుద్ధాన్ని ద్వేషిస్తుంది
పక్షిని ఆకాశాన్ని ప్రేమిస్తుంది.
జలం ఆమె బలం బలగం
కిరణం ఆమెకిరీటం.
ఇంద్రధనస్సు ఒక స్వయంవరం
రండి అమ్మను ఎన్నుకుందాం!
ఆకాశమంత ఎత్తుకు ఎదుగుదాం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి