తెల్లవారకనే ఎరుపొచ్చి
నల్లని నీటికి మెరుపిచ్చి
వెల్లలు వెలుగుతో వేయించి
చల్లగా కాచే దైవమే వచ్చి!
కదిలే అలల కమ్మని సవ్వడి
పలికే పెదవుల వేదపు సడి
పిలిచే గువ్వల అల్లరి సందడి
తలచే మనసుల తరిగే అలజడి
గంతులు వేసే చేపల ఆటలు
వంతులు వేస్తూ గాలుల పాటలు
చెంతనే ఊగే చెట్టున కొమ్మలు
మంతనాలలో మునిగే ధరణి!
కోటి కోరికలు తీర్చే రూపమై
కదలని చీకటిని తరిమే దీపమై
వదలక వెంట ఉంటాననే తోడై
నలగని నవ్వులు నిలిపే నేస్తమై..
అడగక ఇచ్చిన వరమై విరిసే
పిలువక వచ్చిన ప్రియమైన అతిథై
తెలియని సంతోషం తెచ్చే కబురై
తలవని తీరుగా కురిసే కరుణగా
చెప్పకనే వచ్చిన కాంతి ధారకు
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి