సంగీత సాహిత్యాల సమ్మేళన మైన ఈ నాటి ఆణిముత్యం.
నిజానికి నన్నయకు ముందునుంచే ఉన్న తెలుగు, జానపదుల
వాకిట కురిసిన సిరివెన్నెలే.
నన్నయాదుల కాలానికి తెలుగు కావ్యాకృతిని దాల్చి
రసజ్ఞుల హృదయాలను తెలుగు భాష సోయగాలతో, వెన్నెల జల్లులతో ఝల్లుమనిపించింది.
రాయల రసజ్ఞత,
విరజాజులైవిరిసి ప్రకృష్టమైన బంధము ప్రబంధము,
అష్టాదశ వర్ణనలతో అష్టదిగ్గజ కవుల
ముఖత: వెలసి గుప్పున దివ్య సుగంధాలు వెదజల్లాయి.
తెలుగు భాషా వైభవానికి శతకాలు /మకుటాయమానాలు.
నీతులు, క్లుప్తత,
సందేశాలు, ముఖ్యంగా పిల్లలకు అవి శతవిధాన పనికి వచ్చే ప్రక్రియ ఇదే శతకాలఉద్దేశం. ఇవి మనిషికి అత్యంత అవసరం అందుకే కేసిరాజువారు దానిని అమృతం అన్నారు చాలగొప్పగా మనపిల్లలకు అదే కరువైది ఇప్పుడు. "ఇది తప్పు" అంటే అసలు తప్పంటే ఏంటి?అని ప్రశ్నించే కాలమిది.
చివర సంగీత సరస్వతులు, పదాల అన్నమయ్య, కీర్తనల త్యాగయ్య కురిపించారు, మనకిచ్చారు సంగీతసుధ.
ఇంతకన్నా కావలసినదేమి.
సంగీత సాహిత్య సమలంకృతే... ఈ అమృత వాక్కులు
అక్కడివే. వేల సంవత్సరాల కృషి ఫలితమే ఈనాటి తెలుగుకు ఒక ఆకృతి ఏర్పడింది దీనిని కాపాడుకోవడం మన బాధ్యత అని ఆణిముత్యాలు ద్వారా మరి మరి నొక్కి నొక్కి చెప్తున్నారు మన ఆత్మీయ సోదరులు, ఆంధ్ర సారస్వత పరి షత్ ముఖ్య నిర్వాహకులు శ్రీ కేశిరాజు రాంప్రసాద్ గారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు, వందనాలు. వారి మాట విందాం. తెలుసుకుందాం తెలుగు భాషలోనీ వెన్నెల వెలుగులను,
విరజాజుల సోయగాల
సుగందాలను,
శతకాల అమృత తత్వాన్ని.
తెలుగుభాషలోని సంగీతంలో ఉన్న సరిగమలొలికించు సుధను.
దీనికి మనమంతా కృషి చేద్దాం.( ఆంధ్ర సారస్వత పరిషత్ వారు నిర్వహించే కార్యక్రమం ఆణిముత్యాలు )
డా.సి. వసుంధర,చెన్నై. 3/7/25
(వయసు వల్ల వచ్చే ఇబ్బందులు నేను రాసే వాటిల్లో తప్పులకు కారణం కావచ్చు. పెద్ద మనసుతో మన్నించ ప్రార్థన.)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి