అభ్యుదయ కవితా చక్రవర్తి దాశరథికి నా అక్షరాంజలులు:- కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)విశాఖపట్నం.

 నా తెలంగాణ కోటి రతనాల వీణయని
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు దిగిపొమ్మని
జగత్తంత నగరాలు కొడుడుతున్నది దిగిపోవోయ్ దిగిపొవోయ్ అని
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా
పీడితవర్గాల ప్రజలగొంతుకై  నినదించిన పోరాటవీరుడు.
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి
గాలిబ్ ఉర్ధూ గజళ్ళను తెలుగులోనికి అనువదించి
తల్లి తెలంగాణ మీద రచించిన గాలిబ్ గజళ్ళు  ఎందరికో స్ఫూర్తి.
ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతానేనే!  అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగునేనే యని
అగ్నిధార, రుద్రవీణ తిమిరంతో సమరం వంటివెన్నో రచించి
రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కళాప్రపూర్ణ ,గౌరవ డాక్టరేట్  లకే వన్నె తెచ్చిన 
మీరు సరస్వతీ మాత మానస పుత్రులే.
నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో యని
ఆవేశం రావాలి ఆవేదన కావాలి
ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా
కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా
గోదారి గట్టుంది గట్టుమీద  చెట్టుంది ,
ఖుషీ ఖుషీ గా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ యని
ఎన్నో ఎన్నెన్నో మరపురాని  మథుర గీతాల నందించిన దాశరథి కృష్ణమాచార్య
మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి   అభ్యుదయ కవితా చక్రవర్తియే
మీ శతజయంతి సందర్భంగా 
అందుకోండి నా అక్షరాంజలులు....!!
............................

కామెంట్‌లు