అక్షరాలు
ఆడిస్తున్నాడు
ఆనందము
అందిస్తున్నాడు
అక్షరాలు
వెలిగిస్తున్నాడు
కవనకాంతులు
వెదజల్లుతున్నాడు
అక్షరకౌముది
చల్లుతున్నాడు
అంతరంగాలను
ఆకట్టుకుంటున్నాడు
అక్షరకుసుమాలు
అల్లుతున్నాడు
అంతర్యామిని
అలంకరిస్తున్నాడు
అక్షరసౌరభాలు
ప్రసరిస్తున్నాడు
అందరిమదులను
అలరిస్తున్నాడు
అక్షరసేద్యము
చేస్తున్నాడు
కవితాపంటలు
పండిస్తున్నాడు
అక్షరజల్లులు
కురిపిస్తున్నాడు
కైతానదులను
పారిస్తున్నాడు
అక్షరామృతము
సృష్టిస్తున్నాడు
కయితాసుధలను
క్రోలుకోమంటున్నాడు
అక్షరచిత్రాలు
గీస్తున్నాడు
అద్భుతరూపాలను
చూపిస్తున్నాడు
అక్షరశిల్పాలు
చెక్కుతున్నాడు
సంతసాలను
పొందమంటున్నాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి