భారతీయుల పూజ గురువు:- విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్.
సాహితీకవికళా పీఠం
 సాహితీ కెరటాలు 
===================
నైతికత, ధర్మం, సత్యాల పునాదులతో,  
మంచికి మంచీ, చెడుకి చెడూ అనే,
కర్మ సిద్ధాంతాన్ని నమ్మే భారతదేశంలో, 
సనాతన ధర్మ కర్త వేదవ్యాసుడు.

పరాశర మహర్షి మోహానికి ఫలితంగా, సత్యవతికి కళంకం అంటకుండా పుట్టి,
కురువంశాన్ని నిష్కళంకంగా నిలిపిన,
మహాభారత కర్త వేద వ్యాసుడు.

వేదాల జ్ఞానాన్ని అన్ని వర్గాల జనులకూ జనరంజకంగా తెలియజేసేందుకు,
ఋగ్వేద, యజుర్వేద సామవేద అధర్వణ వేదాలుగా విభజించి,
అశేష ప్రజాబాహుళ్యానికి,
గురుతుల్యుడయ్యాడు వేదవ్యాసుడు.

శుక మహర్షి జనకుడు వేదవ్యాసుడే.
లోక సంచారంతో జ్ఞానప్రచారం చేస్తూ, 
భారతీయులంతా ఆధ్యాత్మికంగా కొలిచే,
శ్రీమద్భాగవతాన్ని శుకబ్రహ్మ ఉపదేశించాడు.

వ్యాస మహర్షి మహాభారత రచయితగా,
గ్రంథస్థం చేసే గణపతి వేగానికి కళ్ళెం వేయడానికే,
చెప్పేది అర్థం చేసుకునే వ్రాయాలని గొళ్ళెం పెట్టిన, 
సప్త మహర్షి వేదవ్యాసుడు మన పూజ్య గురువు.

•••••••••••••••



కామెంట్‌లు