ఆ పాఠశాలలోకి కొత్తగా ప్రవేశించాడు వాసు. వాసు 9వ తరగతిలో కొత్త పాఠశాలలో చేరాడు. వాసు ప్రవేశించేనాటికి ప్రతి సబ్జెక్టులో కొన్ని పాఠాలు పూర్తి అయ్యాయి. అందుకే వాసు చదువులో వెనుకబడినాడు.
పరీక్షలు మొదలయ్యాయి. వాసూకి కొన్ని ప్రశ్నలకు జవాబులు రావడం లేదు. వాసు అవస్థ గమనించిన మోహన్ తాను రాస్తున్న జవాబులను చూసి కాపీ చేయమన్నాడు. వాసు నిరాకరించాడు. వాసు పరిస్థితి చూసి, జాలిపడి, సోము అనే విద్యార్థి "నేను స్లిప్పులు రాసుకుని వచ్చా. నీకు ఇస్తా. కాపీ చెయ్యి." అన్నాడు. వాసు నిరాకరించాడు.
పరీక్ష పూర్తయింది. వాళ్ళిద్దరూ వాసు వద్దకు వచ్చారు. వాసును మందలించారు. అప్పుడు వాసు ఇలా అన్నాడు. "పరీక్షల్లో స్లిప్స్ పెట్టి కాపీ చేయడం దొంగతనంతో సమానం. ఇతరులు తాము రాస్తున్నది చూసి రాయడం బిచ్చం ఎత్తుకొని తినడంతో సమానం. నాకు అంత నీచమైన బతుకు వద్దు. ముందు ముందు కష్టపడి చదివి, నా మార్కులు పెంచుకుంటా." అన్నాడు వాసు. "శభాష్! నీ ఆలోచన నాకు నచ్చింది. నీకు మంచి భవిష్యత్తు ఉంది." అన్నారు ఇదంతా వీరికి తెలియకుండా వెనుక నుంచి గమనిస్తున్న ఉపాధ్యాయుడు వేంకటేశం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి