వాస్తవాలకి దూరమై.....:- పార్లపల్లి నాగేశ్వరమ్మ-నెల్లూరు
సాహితీ కవి కెరటాలు
\===============
అందని ద్రాక్ష పుల్లన.. అన్న తీరున ..!
చేరుకోలేని గమ్యాలు నిజంగా భారాలు.

ఆశకి వాస్తవానికి మధ్యల పెరిగితే దూరం...
చుట్టు ముడుతుందేమో నిరాశనిసృహల భారం..!

తెలుసుకోవాలి పరుదుల పరిజ్ఞానం . 
అత్యాశలు ...భేషజాలతో
 కనుమరుగు  అవుతున్న మనశ్శాంతులు..!

ఎందుకు చేస్తున్నాడో మనిషి నేల విడిచి సాములు ?
కలిగి ఉండాలి యుక్తాయుక్త విచక్షణలు.

ఏర్పర్చుకోవాలి స్పష్టమైన గమ్యాలు ..!

ఏ మార్చి సాగరాదు నీ గమనాలు.

సత్యాన్వేషణతో జ్ఞాన సమర్జన ,
అనుభవాలతో మెండైన ఆచరణ ,
నింపుకో..మానవత్వంతో దయార్ధత.

అర్థం చేసుకో సామాజిక పోకడలు .
ఎటు చూసినా కన్నీటి వ్యధల గాధలు.

పేదవాడికి దక్కని న్యాయాలు .

విస్తరించి ఉన్న అసమానతల వ్యత్యాసాలు.

పట్టణాలలో వెలుగుల భ్రమలు ......,

పల్లెటూరులో రైతు చిందించే శ్రమ జలాలు ....,
సొంత ఊరికి దూరమైన వలస బ్రతుకులు .

మనిషికి మనిషికి మధ్య పెరిగిపోయిన దూరాలు.

ఎలాగైతేనేం ..వాస్తవాలకు దూరంగా .......
అనుకరణలకు దగ్గరగా.....
 యాంత్రికంగా ...మనిషి జీవితాలు....
ఇలా...ఇలా..... మనిషి తనకు తానే ....దూరంగా.........!


కామెంట్‌లు