శ్రీ శంకరాచార్య విరచిత -గణేశ పంచరత్న స్తోత్రమ్ :- కొప్పరపు తాయారు

 ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం | 
కళాధరావతంసకం విలాసిలోకరక్షకం || 
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం | 
నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ||

అర్థం: చేతిలో మోదకం (లడ్డు) పట్టుకొని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించేవాడు, చంద్రుడిని అలంకారంగా ధరించినవాడు, సుఖ జీవనం గడిపే వారిని రక్షించేవాడు, నాయకులు లేని వారికి నాయకుడై, ఏనుగుల వంటి రాక్షసులను సంహరించేవాడు, భక్తితో నమస్కరించే వారి అశుభాలను నాశనం చేసే వినాయకుడికి నమస్కరిస్తున్నాను.
        *******

కామెంట్‌లు