బరువు భారమై భరించలేనివేళ:- డా. మంజు ప్రీతం కుంటముక్కల-మదనపల్లె
సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
=============
రావణునికి లభించిన వరమే,
ఆత్మలింగం పరమ శక్తి రూపమే!
భక్తిలో మునిగిన రాక్షసేంద్రుడు,
శివుని దీవెనకు పాత్రుడయ్యాడు.

దైవానుసారం భారమయ్యే లింగం,
గోకర్ణ తీరం తాకిన ఆత్మలింగం –
విజ్ఞారూప బాలుడి చేతి ప్రసాదం,
బరువు భారమై భరించలేని వేళ!

పదును తెగిన భక్తి పరీక్షలో,
రావణుడి గర్వం జారిన సంధ్యలో –
నలభై రోజుల వ్రతఫలం
నిమిషంలో భూమికి జారింది.

ఆత్మలింగమా! నీవు నీవుగా నిలిచావు,
అహంకారమునకు నిత్య దర్పణమయ్యావు!
పవిత్రతను అందుకున్న ఆ భూమి –
గోకర్ణంగా నిలిచింది యుగయుగాలకూ!

జయ జయ శంభో శంకరా!
నీ లీలే మహా వినోదము గదరా..!

చూడ చక్కని పరమేశ్వరా,
రావణ విజయ సూత్రధారి నీవే రా…!!


కామెంట్‌లు