న్యాయాలు-913
"తృషా తృష్య త్యాస్యే పిబతి సలిలం స్వాదు సురభి "న్యాయము
*****
తృష అనగా దాహము, దప్పిక.తృష్య అనగా దాహము, కోరిక.త్యాస్యే అనగా త్యజించడం, వదులుకోవడం,వదిలిపెట్టడం.పిబతి తాగుతాడు,తాగుతుంది.సలిలం అనగా నీరు, జలము.స్వాదు అనగా రుచికరమైన,తీపి, రుచి, ఆనందం, అనుభూతి. సురభి అనగా సువాసన,ఆవు అనే అర్థాలు ఉన్నాయి.
దాహం వేస్తూ ఉంటే నీరు తీయగా పరిమళముగా ఉంటుంది.
మనం ఎండలో పడి దూరాలు నడిచినప్పుడు ఏ కొంచెం చెట్టు నీడ దొరికినా ప్రాణానికి హాయిగా ఉంటుంది.అలాగే బాగా దాహం వేసి గొంతు తడారిపోయి, నాలుక పిడుచగడుతున్న సమయంలో తాగే నీళ్ళు బావి నీళ్ళా ? చెరువు నీళ్ళా? ఇంకే నీళ్ళయినా సరే గుక్కెడు దొరికి, వాటిని తాగుతూ ఉంటే ప్రాణాలు లేచొచ్చిన్నట్లు, తీయగా పరిమళముగా అనిపిస్తుంది.
దీనికి సంబంధించిన శ్లోకం మొత్తం భర్తృహరి వైరాగ్య శతకంలో ఉంది చూద్దామా!
"తృషా తృష్య త్యాస్యే పిబతి సలిలం శీత మధురం/ క్షుధార్త శాల్యన్నం కవలయతి మాంసాది కలితమ్/ప్రదీప్తే కామాగ్నౌ సుదృఢతరమ్ ఆలింగతి వధూం/ ప్రతీకారం వ్యాధః సుఖమ్ ఇతి విపర్యస్యతి జనః"
అనగా బాగా దాహం వేస్తూ ఉంటే నీరు తీయగా పరిమళముగా ఉంటుంది.ఆకలితో బాధ పడుతున్న , ఆకలితో ఉన్నప్పుడు కడుపు నింపుకోవడం కోసం తినడం సహజమే.కానీ కామం అనే అగ్నిలో, దాని నివారణ కోసం మనం చేసే కృషి చివరకు నష్టాన్ని తెస్తుంది అని ఒక అర్థము. బాగా దాహం వేసినప్పుడు తాగే నీరు తీయగా ఉంటుందనీ, బాగా ఆకలిగొన్న సమయంలో తిన్న భోజనము రుచిగా ఉంటుందనీ, అత్యంత ప్రకాశవంతమైన కోరికతో కాబోయే వధువును కౌగలించుకోవడంలో ఆనందం ఉంటుందనీ, దెబ్బకు దెబ్బ తీయడం ఒక వ్యాధిగానూ,అతి సుఖం జనానికి తిరగబడుతుంది అనగా వ్యతిరేక ఫలాన్ని ఇస్తుంది కాబట్టి , కామం, సుఖం కోరుకో కూడదు. చివరికి నష్టాన్ని కలుగ జేస్తుంది అనే భావం ఇందులో యిమిడి ఉంది.
ఈ న్యాయము గురించి మరింత చెప్పుకోవాలంటే ముందుగా ఓ సామెతను గుర్తు చేసుకోవాలి. అదే " ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు".
తట్టుకోలేని ఆకలి వేసినప్పుడు తినే తిండి ఎలా వున్నా, ఆఖరికి పచ్చడి మెతుకులు అయిన పరమాన్నంలా రుచిగా ఉంటాయి. అలాగే నిద్ర సుఖమెరుగదు అంటే బాగా అలిసిపోయి నిద్ర వచ్చినప్పుడు పట్టు పరుపు, మంచం, దిండు మొదలైనవి ఏవీ లేకపోయినా కటిక నేల మీద పడుకున్నా మంచిగా నిద్ర పడుతుంది.
అందుకే సుమతీ శతక కర్త ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రాసిన పద్యాన్ని చూద్దామా.
ఆకొన్న కూడె యమృతము/ తాగొంకక నిచ్చువాడె దాత ధరిత్రిన్/ సోకోర్చు వాడె మనుజుడు/ తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ!"
అనగా ఓ బుద్ధిమంతుడా! ఆకలితో ఉన్నప్పుడు తిన్న భోజనము అమృతమంత రుచిగా ఉంటుంది.ముందు వెనుక ఆలోచించకుండా దానం చేసేవాడే ఈ భూమిపై గొప్ప దాత.అన్ని కష్టనష్టాలను ఓర్చుకుని గౌరవాన్ని నిలబెట్టుకోగలిగే వాడే నిజమైన మనిషి అని భావము.
ఏవైనా సరే దొరకనప్పుడు, అందుబాటులో లేనప్పుడు వాటి విలువ తెలుస్తుంది. అనే అర్థంతో ఈ "తృషా తృష్య త్యాస్యే పిబతి సలిలం సురభి" న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
కాబట్టి వాటి విలువ తెలిసి మసలుకోవాలి అనేదే ఇందులో మనం తెలుసుకోవలసిన విషయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి