ఇంతేనా?:- జంజం కోదండ రామయ్య-జమ్మిపాళెం
సాహితీ కవి కళాపీటం
సాహితీ కెరటాలు
=============
శరీరాలు వేరేకాని
మనసులు ఒక్కటేనని
మధుర, మంజులమైన స్నేహం చేశాము!

ఏ విషపురుగు పడిందో
పచ్చని స్నేహాన్ని
విచ్చిన్నం చేసింది!

ఎవరు చేశారో నేరాలు
చేరలేక పోయాము
ఆనంద సుదూర తీరాలు!!

అందరూ మెచ్చేలా అర్ధాంగిని
ఆప్యాయంగా చూసుకున్నాను
చెప్పుడు మాటలు విని నాపై
చేసుకున్నది కాపురం
చిందర వందర!!

వందేళ్ళు హాయిగా సాగాల్సిన
కాపురం
చేరలేక పోయింది సుదూర తీరాలు!!

ఎప్పుడు చేరునో
జీవితం సుఖాల తీరం
సమసి పోయేదెప్పుడో
బాధల పెనుభారం?



కామెంట్‌లు