సాహితీ కవి కళాపీఠంసాహితీ కెరటాలు============అమావాస్య, పౌర్ణమి సమయాల్లో చంద్రుడికి తప్పవు...హేచ్చుతగ్గుల ఇక్కట్లు!అమావాస్యనాడు గ్రహాలు చుట్టు ముట్టి ముసుకు పోవడం...పొర్ణమినాడు గ్రహాల అనుగ్రహంతో వెలుగులీనడం సహజాతి సహజం!కష్టసుఖాల సమ్మిళ్ళితం మానవ జీవితం!కష్టకాలంలో కృంగి పోవడంసుఖాల సమయంలో పొంగి పోవడం అత్యంత సహజం!సహజంగా జరిగే కార్యాలకు స్పందించక...వినీలాకాశంలో చంద్రునిలా..జీవితంలో మనిషి తొణకక, బెణకక,స్థితప్రజ్ఞతను ప్రదర్శించాలి!చంద్రునిలా సమయానుకూలంగాప్రవర్తనావళిని మార్చుకోవాలి!జీవిత అర్ధ, పరమార్ధములను గ్రహించి,మానవసేవే మాధవ సేవగా తలంచి,మంచితనమే మూలధనంగా భావిస్తూ...జీవిత పధ గమనంలో ముందడుగు వేయాలి!!!చంద్ర బింబంలా కాలానుగుణంగా వచ్చే ఆటుపొట్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి!పరిపూర్ణ జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలి!!!
జీవిత పరమార్ధం డా. ఆళ్ళ నాగేశ్వరరావు - తెనాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి