మునుము :- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
వానకారు కేరింతల శైశవ  తుంపరలు లక్ష్యించిన దృశ్యం
ఎగిసింది అక్షర ఆకాశంలో మునుంపట్టి ఆశగా

ఘన కీర్తుల కలం కాళన్న అక్షర శరధి  తెలంగాణ యోధులు సాహిత్య సమరాంగనాన
బానిసగా చూసిన రాజుల పాలనను ఎదిరించిరి నాడు
కీర్తనల రెక్కలు ఎగిరి చరిత్ర లిఖించే
సామాజిక ప్రజా కవనం కదనమై 

ఆ స్ఫూరి గొప్పతనం ఇరుకైంది నేడు
కాదుకాదు లుప్తమైంది సుమా!

నేను, నాదను చోట సామాజిక 
అంగారమే చన్నీళ్ళ ఫ్రిజ్ చొచ్చే
నజరానాల వంది, వేళ్ళు
కలిపిన చేతుల చప్పట్ల బృహధ్వని
అధికారాంధకార దాసోహమై   
కదిలే దూపగా

నేర్పుడు ఊర్పుడులో అక్షర ధుని
తీరని దాహమే కదా ప్రైజ్ తీపి
నోళ్ళూరించే కలాలు
పట్టుదప్పిన గీత మునుం బెట్టి
దారిలో చిక్కము పట్టె భావోద్వేగాలనే

=================================

(నేడు దాశరథి శత జయంత్యుత్సవాల ముగింపు సందర్భంలో...)

కామెంట్‌లు