సహజ ప్రక్రియ :- పార్లపల్లి నాగేశ్వరమ్మ
సాహితీ కవి కెరటాలు 
=================
సహజ ప్రక్రియకు సమానంగా సదా ఆహ్వానం పలుకుదాం !

నింగిలోని అందమైన చందమామ, 
నిలకడ లేక దినం దినం అనుదినం,
 సంతరించుకొనుకొత్త రూపం ...!

పౌర్ణమిలోప్రసరించును చల్లని కాంతి కిరణం ..!
అమావాస్యకి అట్టిడిగిన ఆశవలె నిశి రూపం.!
పెరుగుట తరుగుట కొరకే అన్నది, జగమెరిగిన సత్యం !

తరిగినా పెరుగుట కొరకు చేయాలి పోరాటం అనునిత్యం ...!

ప్రతి దశలో ఒక క్రొత్త అనుభవం ..
ప్రతి అనుభవం నేర్పునుజీవిత పాఠం.
ప్రతి పాఠం ఒక కొత్త బాటకు నాంది .!

వెన్నెల వెలుగులే కాదు వేడి సెగలు, 

అమావాస్య నిశి రాత్రులు అన్నింటికీ ,
పలకాలి సమానంగా ఆహ్వానాలు .

కష్టాల మబ్బులు కావు కదా శాశ్వతాలు ,
ఊరటను ఇచ్చును కదా పున్నమి వెన్నెల సోయగాలు!

చీకటి లేనిదే తెలియదు కదా వెన్నెల వెలుగుల విలువ ,
వెలుగు లేనిదే వీడదు కదా చీకటి భయముల గోల!


కామెంట్‌లు