సాహితీ కవికళాపీఠం.
సాహితీ కెరటాలు.
================
అల్లంత దూరాన, ఆ నీలి సంద్రం.
లోతులెంతో,ఎవరికి తెలుసు
ఆగగన సీమల్లో,శశాంక తారకలు,
దూరాలెంతో,ఎవరికి తెలుసు.
నీ గుండె లోతుల్లో,గూడు కట్టిన,
బాధ,లోతు ఎంతో,ఎవరికి తెలుసు.
తపనల,ఆరాట, పోరాటాల,వైనం..
నీ అలిసిన మనసుని,అడుగు.
తీరానికి చేరేఅలలు,ఎగసిపడేబాధ,
సముద్రుడిని చెప్పాలని అడుగు.
మేఘాల,గుండె బరువై,వర్షిస్తుంటే
సూదూర తీరాల పయనం ఎక్కడికి? అని అడుగు
తేనెటీగనడుగు, ఏతీరాల పయనం.
నింబకుసుమాలా,జాజిసంపెంగకా!
ఊరికే జలపాతాల,హొయలెందుకో!
సముద్రుడి సంగమంకోసం పరుగా!
కలువకన్నెల,ఎదురుచూపులు
శశి కోసమా! గండు తుమ్మెదలకా?
రాధ హృదయ వేణుగానం,ఎవరికో!
కొంటెసైగలతో,కవ్వించే,మాధవుడికా?
నీతీయని తలపుల,తకధిమితాళం
మోహన రాగమై,ఎదురు చూపులా?
కనుదోయిబరువెక్కె, కన్నీటిసంద్రమై.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి