మోత్ రాత్రిపూట లైట్ కాంతికి ఆకర్షింపబడుతుంది. అది గుండ్రంగా బలయాకారంగా ఆ కాంతి పడే లైట్ చుట్టూ తిరుగుతుందిక్యాటర్ పిల్లర్ అంటే సీతాకోకచిలుక గా మారాలంటే అది ఉండే దశ.అది ప్యూపా దశలో నిద్రపోతుంది దానిలో ఉన్నటువంటి ఆహారం కొవ్వు కీటక దశకి మారేలా మార్పు చెందుతుంది ఈ గొంగళి పురుగు దశలో తమ ఇష్టం వచ్చినట్లు చెత్తాచెదారం తిని ఆ తరువాత క్రిమిగా మారటానికి కావాల్సింది మాత్రమే గ్రహిస్తుంది క్యాట్రపిల్లరు ఒక కొమ్మకి లేక ఆకుకి వేలాడుతూ ఉంటుంది ఆ తరువాత క్యూపాదశలో చుట్టూతా గూడు కట్టుకుని అలా ఆహారం లేకుండా నిద్రవస్తలో ఉండిపోతుంది. దేనికి చెలించదు కదలదు.చిన్న బెరడుముక్కలాగా ఆకు చిన్న పిందె ఆకారంలో శత్రువు కంటబడకుండా ప్యూపా బ్రతికి బట్ట కడుతుంది.
సాధారణంగా అన్ని కీటకాలు క్యాటర్ పిల్లర్ దశలో ఉంటాయి ఇవి ఒక కర్ర పుల్లను లేదా ఆకును ఆధారంగా చేసుకుని పైకి పాకుతూ ఉంటాయి మనం ఒక పుల్లను దాని ముందు పెడితే అది చకాచకా పైకి పాకుతుంది పుల్లను మనం కిందకి వంచితే తిరిగి ఆ క్యాటర్ పిల్లర్ పాకుతూ వస్తూనే ఉంటుంది దాని భావంలో ఆకులు కొమ్మకి పై భాగంలో ఉంటాయి కాబట్టి అక్కడికి చేరాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా క్యాటర్ పిల్లరు ఆకుల రెమ్మలపై పాకుతూనే ఉంటుందిమనకి సిల్క్ అంటే పట్టు పురుగుల నుంచి వస్తుందని తెలుసు ఏషియన్ మౌత్ లార్వా వల్ల సిల్కు తయారు అవుతుంది. బాంబిక్స్ మోరి అనేది పట్టుపురుగు చైనాలో మల్బరీ ఆకులు తిని వృద్ధి చెందింది దాని నోట్లోంచి వచ్చే ద్రవం గాలికి గట్టిపడి దారం లాగా తయారవుతుంది అదే తన శరీరాన్ని దారం లాగా చుట్టుకుని కకూన్ గూడులా ఏర్పడుతుంది ఇవి బాగా పెద్ద అయిన తర్వాత వాటిని వేడినీటిలో వేసి దానిలోంచి దారాన్ని తీస్తారు 3 వేల పట్టుపురుగులను చంపితే 1/2 కేజీ సిల్కు దారం వస్తుంది 4 వేల ఏళ్ళ క్రితమే ఈ సిల్క్ ఈ పట్టు దారం గురించి ప్రపంచానికి తెలుసు దీన్ని సెరికల్చర్ అంటారు కొన్ని భూగర్భంలో కొన్ని నీటి లోపల క్యాటర్ పిల్లర్స్ కక్కున్ రూపంలో దాగి ఉంటాయి నిజంగా ఈ పట్టుపురుగులు సీతాకోకచిలుక జీవిత దశలు అద్భుతం కదూ🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి