సనాతనధర్మమంటే?:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.

 సమాజకల్యాణం కోసం
ఆడినమాట తప్పని హరిశ్చంద్రుడు
తండ్రిమాటకై కాననాలకేగిన శ్రీరామచంద్రుడు
జీవితసారమైన భగవద్గీతను వసుదైకానికానికి అందించిన శ్రీకృష్ణుడు
త్యాగానికి ప్రతిరూపమై త్రాగే నీటిని కూడా ఇచ్చిన రంతి దేవుడు
అసూయ ద్వేషాలను వీడి అనురాగ ఆప్యాయతలు కలిగిన కృష్ణ కుచేల స్నేహబంధం
శరణాగతి అన్న శత్రువుకి కూడా  ఆశ్రయమిచ్చి రక్షించిన వీర శివాజీ
మనుషులంతా సోదరులని
ఆపదలో ఉన్నవారిని ఆదరించాలని
లోకకల్యాణం కోసం శ్రీమద్రామాయణం వ్రాసిన వాల్మీకి
పవిత్రమంత్రం గాయత్రి సృష్టికర్త రాజర్షి విశ్వామిత్రుడు.
సొంతలాభం కొంతమానుకు పొరుగు వారికి తోడ్పడవోయ్ అన్న గురజాడ
శాంతి అహింసలే సాధనాలుగ స్వాతంత్ర్య సముపార్జన చేసిన జాతిపిత మహాత్మాగాంధీ
చికాగోలో ప్రపంచ సర్వమత సభలో సోదర సోదరీమణులారా అని
సంభోధించి సనాతన భారతీయ సంప్రదాయాన్ని వసుదైకానికే ఆదర్శమన్నట్లు ప్రేరణ నిచ్చిన స్వామి వివేకానంద
ఎన్నని, ఏమని చెప్పను?
సనాతన ధర్మం డెంగ్యూ కాదు మానవునికి ధైర్యం
మలేరియా కాదు మానవత్వమే మాధవత్వమని చాటే పవిత్ర ధర్మం.
కరోనా కాదు అందరు కలిసి మెలసి ఉంటే సాధ్యం కానిది లేదని  భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పే సంస్కృతి.
అన్నిమతాల సారము ప్రేమతత్వమే అని
ఓర్పు, సహనం కలగి మానవులంతా ఒక్కటే అని  వసుదైకానికే ఆదర్శమని చెప్పే ధర్మం..!!
( నిన్న ప్రజలచే ఎన్నుకున్న ఒక నాయకుని సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాల తో పోల్చి ప్రసంగించిన వార్త చూసి
ఆర్ధ్రతతో  హృదయం నుంచి వెలువడిన ఆవేదన).
................................

కామెంట్‌లు