అర్ధరాత్రి ని సూచిస్తూ చర్చి గంట పన్నెండుకొట్టింది.లోకమంతా చీకటి దుప్పటి కప్పుకుంది.
కమ్ముకున్న చీకటి మిణుకుమిణుకు మంటున్న నక్షత్రాలను మబ్బులు కమ్మేస్తున్నాయి.చీకటినేలను చల్లగాలి కమ్మేస్తుంది.రాబోయే కష్టానికి గుర్తుగా కాలం కంటి నీరు చుక్కల్లా పడుతున్నాయి.వీస్తున్న వర్షపు గాలి కురుస్తున్న వాన చీకటిరాత్రి ఏదో జరగబోయే ఉదృతానికి సంకేతం అయింది.నిశ్శబ్దంగా ఉన్న ఆరాత్రి ఏకాంతాన్ని భంగం చేస్తూ ఒక నల్లటి కారునిశ్ధబ్దంగా వచ్చి నడిచి పోతున్న ఆమెను ఢీకొట్డింది.ఆమె ఎగిరి అవతలికిపడింది. ఎగిరి అవతల పడ్డ బిడ్డ ఏడుపు ఆప్రాంతమంతా మారుమ్రోగింది.ఆదారి వెంట నడిచి వెళుతున్న రామనాధం ఉలిక్కి పడి బిడ్డవైపు పరిగెత్తాడు.
బిడ్డను పొదివి పట్టుకుని ఆమెదగ్గరకు నడిచాడు రక్తంమడుగులో కొట్టకుంటూ రామనాధం వైపు చూస్తూ కళ్ళుమూసింది.
#################
రామనాధం ఈమధ్యనే పదవీ విరమణ చేశాడు.ఉద్యోగం సద్యోగం లేని తన కొడుక్కు దూరపు బంధువైన చెల్లెలు కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేశాడు తన అవసానకాలంలో ఆదుకుంటుందని.ఆమె పెళ్ళికి ఒప్పుకోకపోతే తన పేరున ఇల్లును ఆమె పేరున పెట్టినా, ప్రతినెలా తన పెన్షన్ లో కొంతభాగం కుటుంబ అవసరాలకు ఇచ్చేవాడు.మిగిలిన వి తను మంచాన బడ్డా అంత్యక్రియలు కోసం దాచి పెట్డుకునేవాడు.
ఎంత అవసరం వచ్చినావాడేవాడు కాదు.ఇంటర్వ్యూలకు డబ్బులులేకపోయినా.అక్కకు వరకట్నం బాకి ఇవ్వవలసి వచ్చినా తన డబ్బులు కదిలించేవాడుకాదు.అదికొడుకు కోడలికి నచ్చేది కాదు.ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడు ఉద్యోగానికి లంచం ఇవ్వవలసి వచ్చినపుడు వారికి తెలియకుండా తన స్నేహితుడిద్వారా సాయం అందించే రామనాధం గురించి తెలియక ఆఖరికి కోడలు శని అని దూషించినామౌనంగా భరించాడు .మామకు కోడలికి మధ్య నలిగిపోతూ చివరకు తండ్రిని వద్దని బ్రతిమలాడినా తీసుకెళ్ళి అనాధాశ్రమంలో చేరుస్తాడు.
స్నేహితుడు తెలిసి ఇంటికి వచ్చి
బీరువాలో దాచిన పోస్టాఫీసు పుస్తకాలు తో పాటు రహస్యంగా దాచిన కవరు చూపిస్తాడు.అది చూసి గుండెలు బాదుకుంటూ ఆశ్రమానికి పరిగెత్తుతారు కొడుకు కోడలు.తండ్రిని క్షమాపణ అడగటానికి.నిజానికి తాను యాక్సిడెంట్ లో దొరికిన బిడ్డనని
ఆకాగితం పోలీసులకు రామనాధం వ్రాసిచ్చిన కాగితమని అనాధ తండ్రి కాదని తాను అనాధ అని తెలుసుకొని ఉద్యోగం వచ్చినా వదులుకుని బ్రతిమలాడినా ఇంటికి రాని తండ్రి దగ్గరే ఉండి సేవ చేయటానికి ఉండి పోతారు.నోరు తెరచి చెప్పకపోతే
వచ్చే అనర్ధాలు ఇలాగే ఉంటాయి అన్న ఈకధ పెదవి దాటితే..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి