అలీ అసామాన్యడు:- - యామిజాల జగదీశ్
 “అలీ సహజ ప్రతిభ కలిగిన గొప్ప వ్యక్తి. నేను లేకుండానే అతను గొప్ప ఛాంపియన్ అయ్యేవాడు. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. నేను ఓ విషయం గట్టిగా చెప్పగలను. అతను బాక్సింగ్ రింగ్ వెలుపల నాకు నేర్పినవి ఓపిక, మర్యాద. ఎదుటివారితో ఎలా మెలగాలనేది అతని నుంచే నేర్చుకున్నాను..." 
ఈ మాటలు ఎవరివో కావు. 
ఏంజెలో డుండీ (ఆగస్టు 30, 1921 - ఫిబ్రవరి 1, 2012) అనే అమెరికన్ బాక్సింగ్ మేనేజర్, బాక్సింగ్ ప్రమోటర్ , బాక్సింగ్ ట్రైనర్. కార్నర్‌ మ్యాన్. అలనాటి ప్రముఖ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ ముహమ్మద్ అలీ (1960–1981)తో కలిసి పని చేసిన క్రమంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తే ఈ ఏంజెలో డుండీ. ఆయన, షుగర్ రే లియోనార్డ్ , సీన్ మానియన్ , జోస్ నేపోల్స్ , జార్జ్ ఫోర్‌మాన్ , జార్జ్ స్కాట్ , జిమ్మీ ఎల్లిస్, కార్మెన్ బాసిలియో , లూయిస్ మాన్యుయెల్ రోడ్రిగ్జ్, విల్లీ పాస్ట్రానోలతో సహా 15 మంది ఇతర ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌లతోనూ పని చేశారు.
“అలీ ప్రతిదానికీ ఎలా స్పందిస్తాడో నేను దగ్గరుండీ చూశాను. అతనికి జరిగిన కొన్ని సంఘటనలు నన్ను ఆందోళనపరిచాయి. అయినా అతనెలా స్థిమితంగా నిలకడగా ఉంటాడో ఆశ్చర్యం కలిగించేది. అతను చెప్పేదంతా 'ఎవరినైనాసరే నువ్వు  క్షమించాలి' అని మాత్రమే."
ఏంజెలో డుండీ గొప్పవాడికి శిక్షణ ఇచ్చి ఉండవచ్చు కానీ అతను ఎప్పుడూ అతన్ని సృష్టించానని చెప్పుకోలేదు. వాస్తవానికి, అతను అలీని పంచ్‌లు లేదా ఫుట్‌వర్కుతో కాదు, దయతో ఆకృతి చేసిన వ్యక్తిగా అభివర్ణిస్తాడు. చేదు అనుభవాలు చవిచూసినాసరే అలీ ద్వేషంతో మెలిగే వాడు కాదు....క్షమాపణతో స్పందించే వాడు. చివరికి, బాక్సింగ్ రింగ్‌లోని పోరాట యోధుడు నాకు రింగుకివతల గురువయ్యాడు. అతను జీవితాంతం నాకు బోధించిన పాఠం మరువలేనిది అని ఏంజెలో నుండీ చెప్పాడు.

కామెంట్‌లు