9వ తరగతిలో ఒక పాఠశాల నుండి మరో పాఠశాలకు అనివార్య కారణాల వల్ల వాసు మారవలసి వచ్చింది. కానీ వాసు ఆ పాఠశాలలో ప్రవేశించే నాటికి అన్ని సబ్జెక్టులలో కొంత సిలబస్ పూర్తి అయింది. కొన్నాళ్ల తర్వాత పరీక్షలు మొదలయ్యాయి. వాసు పరీక్ష సరిగా రాయడం లేదు. మోహన్ తన జవాబులు చూసి రాయమన్నాడు. సోము తాను తెచ్చుకున్న స్లిప్పులను ఇస్తా, కాపీ కొట్టమన్నాడు. వాసు నిరాకరించాడు. దొంగతనంగా జవాబులు రాయడం, ఇంకొకరిని అడుక్కొని జవాబులు రాయడం తనకు నచ్చదన్నాడు. తనకు తక్కువ మార్కులు వచ్చినా సరే, సొంతంగా రాస్తా అన్నాడు.
అప్పటి నుంచి మోహన్, సోమూలు వాసును చులకన చేయడం మొదలుపెట్టారు. మరో కొంతమంది మిత్ర బృందాన్ని కలుపుకొని అందరూ వాసుని దారుణంగా హేళన చేయడం మొదలుపెట్టారు. వాసు ఇవేవీ పట్టించుకోలేదు. వాసు మంచితనాన్ని చూసి, క్రమంగా కొంతమంది విద్యార్థులు వాసుతో స్నేహం చేశారు. వాసు వాళ్ళందరితో తీరిక సమయాలలో కలసి ఆడుకున్నాడు. ఆ తర్వాత వారందరినీ కలుపుకుని ప్రతిరోజూ కంబైన్డ్ స్టడీ చేశారు. వాసుతో కలసి తీరిక సమయాలలో కలసి చదవడం వల్ల అందరూ మంచి తెలివైన విద్యార్థులు అయ్యారు.
వార్షిక పరీక్షలు పూర్తి అయ్యాయి. వాసు క్లాస్ ఫస్ట్ వచ్చాడు. వాసుతో నిత్యం ఆటలు ఆడుతూ, వాసుతో కలిసి చదివే మిత్రులు అంతా మార్కులు అతి భారీగా పెంచుకున్నారు. మోహన్, సోమూలకు ఊహించని షాక్. సిగ్గుతో తల దించుకున్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన రాము వారితో "వాసు తాను చదివిన పాత పాఠశాలలో చిన్నప్పటి నుంచీ ఎప్పుడూ క్సాస్ ఫస్ట్ ర్యాంకే వచ్చేవాడు. పైగా ఎప్పుడూ క్లాస్ లీడరుగా ఉండేవాడు. ఇక్కడకు వచ్చిన కొత్తలో కొంత సిలబస్ విననందున పరీక్షలో వెనుకబడ్డాడు. ఆ తర్వాత పుంజుకొని తిరిగి పూర్వం వలె క్లాస్ ఫస్ట్ వచ్చాడు. ఒక దీపం మరి కొన్ని దీపాలను వెలిగించినట్లు అతడు మరికొంత మందిని తెలివైన వారిని చేశాడు. అతని ముందు మీరెంత?" అని అన్నాడు. వాసూను క్షమించమని వేడుకున్నారు మోహన్, సోమూలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి