వెలుగున తడిసే లోకానికి
తెలియని వరమొకటుంది
తొలగిన కలతల తెరలలో
కలుగును కమ్మని హయని!
వేచిన వేడుక క్షణాలన్నీ
వేగంగా కదిలిరాగా
వేదన జాడలు కనరాని
వేకువ తెచ్చెను కానుకని!
ఇక పై ఇడుములు ఉండవని
ఇంపుగ కాలం గడచునని
ఇలలో స్వర్గము చూతురని
ఇదియే వాడని వాడుకని!
చెదిరిన మనసుని చేరదీసి
బెదరక అడుగులు ముందుకేసి
వదలక చేసె యత్నాలే
కదలక నిలిచే సౌఖ్యాలని!
కొత్త బలముల సహకారంతో
ఎత్తుగా ఎదిగే అవకాశాలను
మొత్తం వదలక వాడుకొని
చిత్తం పదిలంగా కాపాడుకోమని!
చక్కగా కబురులు చెబుతూ
చిక్కని మాయను తొలగిస్తూ
తక్కువ కాదు నీవంటూ
మక్కువ మీరగా అనుగ్రహిస్తూ
మేలుకొలిపే వెలుగుల వేలుపునకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి