శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలంలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా రెండేళ్ళు పనిచేసి, బదిలీపై వెళ్లిన కుదమ తిరుమలరావుకు, మండల విద్యాశాఖ ఘనంగా సన్మానించింది. తిరుమలరావు 2023లో విజయనగరం జిల్లా రాజాం మండలం కొత్తవలస ఎంపియుపి పాఠశాల నుండి, ఈ మండలం
కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చి రెండేళ్ళు తన సేవలనందించారు. నేడు శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలకు బదిలీపై వెళ్లిన నేపథ్యంలో తిరుమలరావు సేవలను కొనియాడుతూ మండల విద్యాశాఖాధికారులు చందక గోవింద, నిమ్మల శ్రీనివాసరావు తదితరులు ఘనంగా సన్మానించారు. తిరుమలరావు కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవలందిస్తూ తొలి విద్యాసంవత్సరంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వోని ఎంపియుపి పాఠశాలకు పనిసర్దుబాటుపై తాత్కాలిక బదిలీ కాగా, మరలా కడుము చేరుకున్న తిరుమలరావు, రెండో విద్యాసంవత్సరంలో కూడా ఇదే మండలం పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలకు పని సర్దుబాటుపై, తాత్కాలిక బదిలీ కాబడి, ఆదర్శవంతమైన సేవలనందించారు. కొత్తూరు మండల వనరుల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం దూరవిద్యా విధానం గురించి నేడు జరిగిన అవగాహన సదస్సు వేదికపై తిరుమలరావు స్వీయ గీతాన్ని ఆలపించి అందరి అభినందనలను పొందారు. అనంతరం తిరుమలరావును విద్యాశాఖాధికారులు చందక గోవింద, నిమ్మల శ్రీనివాసరావులతో పాటు కొత్తూరు, మెట్టూరు, కుంటిభద్ర, కురిగాం, మాకవరం, మాతల క్లస్టర్ కాంప్లెక్స్ ఛైర్మన్ లు ఎం.గోవిందరావు, డి.ఎల్.నరసింహం, బి.ఈశ్వరరావు, జి.సూర్యనారాయణ, ఎం.వెంకటరఘణమూర్తి జి.వెంకటరమణలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కె.విజయకుమార్, కె.శాంతారావు, ఆర్.ఆర్.ఎం.కొండలరావు, డి.ఆర్.దాసు, వి.మధుసూదనరావులు, ఎంఆర్సీ ఉద్యోగులు పి.ఐ.ఈశ్వరి, కె.రాజేష్, పి.స్వప్న, కె.అప్పలనాయుడు, సి.హెచ్.సంతోష్, ఎ.హిమబిందు, పి.సుజాత, జి.శంకరరావు, ఎ.గోవిందరావు, ఎన్.వెంకటరావు, ఎన్.రామారావు, పి.నాగభూషణం తదితరులు శాలువా పుష్పగుచ్చం జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి