దాటొచ్చిన దారి: - జయా
దాటొచ్చిన దారిని
పక్షులు మళ్ళీ
వెనక్కు తిరిగి చూడవు

నేను చూస్తాను

ఎప్పుడో
చల్లిన కొన్ని విత్తనాలు
చెట్లయ్యాయి

ఎప్పుడో 
విసిరిన కొన్ని రాళ్ళు
దేవుళ్ళయ్యాయి

ఎప్పుడో
వదిలించుకున్న
కొందరు 
ఇప్పటికింకా
అలానే ఉన్నారు 


కామెంట్‌లు