ఉపకార వేతనానికి ఓడిఎఫ్ విద్యార్థిని ఎంపిక

  హైదరాబాదుకు చెందిన జటధార ఎడ్యుకేషనల్ అకాడమీ పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు మేలో నిర్వహించిన ఉపకార వేతన ప్రతిభాపాటవ పరీక్షలో మండలంలోని ఆయుధ కర్మాగారం (ఓడిఎఫ్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కేతావత్ నందిని ప్రతిభ కనపరచి ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి, గైడ్ ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదవ తరగతి విద్యార్థులకు రెండు విడతల్లో పరీక్ష నిర్వహించి 100 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి ప్రతినెలా 500 రూపాయలతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు రెండు సంవత్సరాలు సంస్థ ఉచిత శిక్షణను అందిస్తుంది. తమ పాఠశాల విద్యార్థిని ఈ ఉపకార వేతనానికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు రజిత, విజయ భాస్కర్, రవీందర్, చవాన్ సుభాన్ సింగ్, సంధ్య, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా నందిని పదో తరగతిలో కూడా 543 మార్కులు సాధించి ఐఐటీ చదవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కామెంట్‌లు