'రంగులు ':- ---డా.పోతగాని సత్యనారాయణ

(ఒత్తులు లేని బాల గేయం-5)
 
మందారపూవు ఎరుపండి
ఆకాశముంటది నీలంలో

నారింజ పండు కాషాయం
అభిమానం రంగే గులాబీ
 
శుభాల సూచిక పసుపంట
కాటుక రంగది నలుపండి

శుచిని తెలుపునది తెలుపైతే
మరి ఆకులకుండే రంగేది?


కామెంట్‌లు