మగాడి వేషంలో...:- - యామిజాల జగదీశ్
 భర్తను కోల్పోయిన ఓ స్త్రీ దాదాపు ముప్పై ఏళ్ళుగా మారువేషంలో ఓ మగాడిలా జీవిస్తున్న వైనమిది. తన ఏకైక కూతురిని గట్టెక్కించడం కోసం ఆమె అలా బతుకుతున్నారు. 
తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాలో గల కాట్టునాయకన్ పుట్టి గ్రామానికి చెందిన వారు పేచ్చియమ్మాళ్. ఆమెకు ఇరవయ్యో ఏట పెళ్ళయ్యింది. పెళ్ళయిన కొంత కాలానికే ఆమె గర్భవతి అవడం, గుండెపోటుతో భర్త మరణించడం జరిగిపోయాయి. ఆమెను మళ్ళీ చేసుకోమని కుటుంబసభ్యులు ఎంతలా ఒత్తిడి చేసినా ఆమె అందుకు సమ్మతించలేదు. కొన్ని నెలలకు ఆమెకు కూతురు పుట్టింది.
కుటుంబాన్ని చూసుకుంటూ ఇంటిపట్టున ఉండమని తల్లిదండ్రులు చెప్తూ వచ్చారు. కానీ ఆమె వారి పట్టించుకోలేదు. ఎవరికీ భారంగా ఉండకూడదనుకున్న పేచ్చియమ్మాళ్ ఓ గట్టి నిర్ణయానికి వచ్చారు.
గుండు చేయించుకుని విగ్ పెట్టుకుని మగాడిలాటి వేషధారణతో నలుగురిలో తిరిగారు. ఎవరికీ ఏ అనుమానమూ రాలనంతగా తయారయ్యే వారు. అంతేకాదు పేరు కూడా మార్చుకున్నారు "ముత్తు" అని.
ఇలా మగాడిలా నడయాడటం వల్ల కొందరి మగవారి విక్రత చూపుల నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావించారు.
హోటల్, టీ కొట్టు, పెయింటింగ్, క్లిష్టమైన కూలీ పనులనైనా చేయడం అలవాటు చేసుకున్నారు. ఆమె పని చేసిన ప్రతి చోటా మగాడే అనుకుని తోటి మగాళ్ళు ముత్తు మాస్టర్ అనే పిలిచేవారు. లేక అన్నా అని అనేవారు. అంటే ఆమె వేషధారణ ఎంతలా ఉండేదో ఆలోచించండి. ముత్తు అనే పేరు మీదే ఆధార్ కార్డు, వోటర్ కార్డు కలిగి ఉన్నారు. బ్యాంకులో ముత్తు పేరు మీదే సేవింగ్స్ ఖాతా ప్రారంభించారు.
బస్సుల్లోనూ మగవారి సీట్లలోనే కూర్చుంటున్న ఆమె పబ్లిక్ టాయిలెట్ లలో కూడా మగవారి క్యూ లైన్ లోనే నిల్చుంటున్నారు.
ముప్పై ఏళ్ళుగా ఆమె ఎవరికీ ఏ సందేహము రానివ్వని విధంగా మగవాడి వేషధారణతో నెట్టుకొస్తుండటం గమనార్హం. అంతేకాదు, తాననుకున్నట్లు కుమార్తెను చదివించి పెళ్ళి కూడా చేసారు పేచ్చియమ్మాళ్.

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం