జీవిత సత్యం- విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్.
సాహితీకవికళా పీఠం

సాహితీ కెరటాలు
 =================
మానవ జీవితమే చందమామ అనేలా,
పుట్టగానే శిశువు జీవనయాన స్థితి కోసం,
జాతకాన్ని చూపే పంచాంగానికి,
ఆధారం చాంద్రమాన కాలమానం!

బారసాల మొదలు చివరి మజిలీ వరకూ,
మంచి చెడుల నిర్ణయానికి పంచాంగమే!
నెలపొడుపు మొదలు పౌర్ణమి వరకూ,
రక రకాల అనుభూతుల సారం జీవితం!

విశ్వంలో ప్రకృతీ పురుషుల సయ్యాట.
జీవితం కర్మ ఫలితాలను సరి చేసే ఆట.
కష్ట నష్టాల సహా గెలుపోటముల బాట.
సుఖ దుఃఖాలతో నెగ్గుకు రావాలి ప్రతీ చోట.

ఒకరి లాభం మరొకరి నష్టం!
ఒకరి సుఖం మరొకరి దుఖం! 
ఒకరిది మరొకరితో పంచుకుంటే!!
చీకటి వెలుగుల ఆనంద కేళి.

మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు.
నెలపొడుపుని అనుసరించి పౌర్ణమి!
పౌర్ణమిని అనుసరించి అమావాస్య!!
ఇంతకుమించి జీవిత సత్యం ఏముంది!!!


•••••••••••••~•


కామెంట్‌లు