'అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలి':--జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష

 కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న రెండు తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీకోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల అవసరాల గురించి హెచ్ఎం ఈర్ల సమ్మయ్యను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపించాల్సిందిగా సంబంధిత ఏఈని కోరారు. ఈసారి ఎఫ్ఎల్ఎన్ లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూర్ణచందర్రావు, పీఆర్ ఏఈ పవన్, ఎంపిఓ అరిఫ్ హుస్సేన్, గ్రామ కార్యదర్శి షాయాబొద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు సురేష్ కుమార్, కొనుకటి శ్రీవాణి, బండారి స్రవంతి, ఇతర అధికారులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు