ఆ ప్రేమొక తేనె చుక్క…? కాదు కాదు…విషపు చుక్క…?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
మనసులో ప్రేమ పుట్టిన వేళ…
రెండు పెదవుల మధ్య
ఒక తియ్యని…ముద్దౌతుంది.! 
బిగికౌగిలిలో ప్రేమికులను 
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది…!

మసక చీకటిలో...
మల్లె తోటలో...
పచ్చని పార్కులో..?
వెచ్చని వెన్నెల్లో చల్లనిగాలిలో…
పూల పాన్పుపై పరవశంలో…!

ప్రేమ ఒక సరసమైతే..? 
సుఖాల తీరం చేరుస్తుంది..! 
ఒక శృంగారమైతే..? 
స్వర్గాన్ని రుచి చూపిస్తుంది..!
ఒక మత్తైతే...నిన్ను చిత్తు చేస్తుంది..!
ఒక మైకమైతే నిన్ను 
మరోలోకంలో విహరింప జేస్తుంది..!

కానీ…ఆ ప్రేమే...
ఆరని ఒక ఆరాటమైతే…
కాటేసే ఒక కాలనాగైతే…
చూపులకు మత్తు పూస్తుంది..!
పచ్చనిజీవితాల్లో చిచ్చు రేపుతుంది..! 
పరువును పాతాళంలో తోసేస్తుంది…!

ఒక వ్యభిచారమైతే..?
సభ్యసమాజానికి మచ్చతెస్తుంది..!
ఒక మోసకారి జ్ఞాపకంగా
చరిత్రలో చెరగని ముద్రవేస్తుంది…!

అందుకే…కళ్లల్లో మెరిపించి…
పెదవుల్లో పుట్టే ముద్దు మురిపాల ప్రేమ…
కౌగిలిలో నలిగే ప్రేమ కామంతో రగిలే ప్రేమ

నిజమైనదైతే...అది తేనె చుక్కే.!
కానీ…కపటమైనదైతే..?
అది...ప్రేమపాలకుండలో
జారిన...ఒక విషపు చుక్కే…!

అందుకే ఓ భగ్న ప్రేమికుల్లారా..!
స్వేచ్ఛగా ప్రేమ పక్షులై  విహరించండి..!  
కానీ ప్రేమపక్షి రెక్కల్ని విరిచేయకండి..!
జాగ్రత్త..!...తస్మాత్ జాగ్రత్త..!



కామెంట్‌లు