కొత్తూరు రచయితల వేదిక నూతన కార్యవర్గం

 కొత్తూరురచయితల వేదిక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆవిర్భవించగా, నేడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు తెలిపారు. 
మూడు నెలల సదస్సులు తన అధ్యక్షతన జరిగాయని, నేడు తనకు ఉద్యోగరీత్యా బదిలీ అయినందున, ఇకపై ఈ కార్యవర్గం ఆధ్వర్యంలోనే సమావేశాలు జరుగుతాయని ఆయన అన్నారు. 
అధ్యక్షులుగా సీనియర్ కవి కలమట శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిగా కవయిత్రి, గాయని అమ్మల కామేశ్వరి,  ఉపాధ్యక్షులుగా ప్రముఖ ప్రవచన కర్త, తెలుగు భాషా పారాయణులు ముదిలి శంకరరావు,  ఉపాధ్యక్షులుగా యువ రచయిత్రి గడసాపు ఉషారాణి, కోశాధికారిగా తెలుగు పండితులు వైశ్యరాజు హరనాథరాజులు ఏకగ్రీవంగా ఎన్నికైనారని తిరుమలరావు ప్రకటించారు. ఈ ఐదుగురితోపాటు  కార్యవర్గ సభ్యులుగా మరో పదకొండు మంది వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. ఎవిఆర్ఎం రాజా దిలీప్ పట్నాయక్, డా.యెన్ను అప్పలనాయుడు, పల్ల నారాయణరావు, పెదకోట ధనుంజయరావు, గేదెల మన్మధరావు, బూరాడ గణేశ్వరరావు, కలమట గోవిందరావు, మావుడూరి మురళీకృష్ణ, గూనాపు శార్వాణి, బూడిద సంతోష్ కుమార్, ఉర్జాన ప్రసాదరావులు కార్యవర్గ సభ్యులుగా వ్యవహరిస్తారని తిరుమలరావు వెల్లడించారు. ఈ సందర్భంగా వీరందరి కవితలతో గతనెలలో జరిగిన మూడో సమావేశంలో కొత్తూరు కవనం అను సంకలనం విడుదలచేసామని గుర్తుచేశారు. అనేక మంది కొత్త కవులు కవయిత్రులు ఉద్భవించేలా, సాహిత్య పరిమళాలను పంచిపెట్టేలా, సమాజాన్ని చైతన్యవంతం గావించేలా ఈ నూతన కార్యవర్గం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు ఆకాంక్షించారు. కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు