లియో టాల్ స్టాయ్ ఓ సుప్రసిద్ధ రచయిత మాత్రమే కాదు ఓ ఉన్నత మానవతావాదికూడా. ఆయన ప్రతి ఒక్కరితోనూ ఎంతో ప్రశాంతంగా సహనంతో నడచుకుంటూ ఉండేవారు. తన పట్ల దారుణంగా ప్రవర్తించేవారిని సైతం మన్నించేవారు. అంతేతప్ప తిరగబడి నానామాటలు అనే బాపతుకాదు. ఎవరినీ చెడుగా ఆలోచించే వారు కాదు. ఈ వైఖరినే ఆయన తన కుమార్తెకు కూడా నేర్పించారు. అందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ.
ఓరోజు ఆయన తన గదిలో కూర్చుని ఏదో రాసుకుంటుండగా తన కుమార్తె ఏడుపు వినిపించింది. ఆయన వెంటనే గదిలోంచి బయటకు వచ్చి కుమార్తెను ఎత్తుకున్నారు. ఆమె కళ్ళను తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు.
అప్పటికీ ఆమె ఇంకా ఏడుస్తూనే చెప్పింది....
పక్కింటి అబ్బాయితో ఆడుకుంటుండగా ఉన్నట్లుండి గొడవొచ్చి అతను తనను కొట్టాడని చెప్పింది. కనుక ఆ అబ్బాయిని కొట్టమని తండ్రితో చెప్పింది.
కూతురు చెప్పిన మాటలన్నీ విన్న లియో టాల్ స్టాయ్ ఆమె కోపాన్ని తగ్గించారు.
అమ్మాయ్ జరిగినదంతా సరేగానీ ముందు ఓ గ్లాసుడు పాలు ఇస్తూ ఆ పాలు తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇవ్వమన్నారు.
అబ్బాయిని కొట్టమంటే ఓ గ్లాసు పాలు ఇవ్వమంటాడేంటీ తన తండ్రి అని మనసులో అనుకునన్నా తండ్రి చెప్పినట్లే చేసింది. ఆమె ఇచ్చిన పాల గ్లాసు అందుకున్న అబ్బాయి ఆశ్చర్యపోయాడు.
అప్పటివరకూ లియో టాల్ స్టాయ్ కూతురు మీద కోపంతో ఉన్న అబ్బాయి మనసు మార్చుకుని ఓ నవ్వు నవ్వాడు. అలాగే కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఆ క్షణం నుంచి వారిద్దరూ మంచి మిత్రులయ్యారు.
కోపం కన్నా మన్నించడమనే గుణం ఎప్పుడూ మంచి ఫలితాలతో మంచి ముగింపు పలుకుతుందని లియో టాల్ స్టాయ్ చెప్పారు. అంతేతప్ప మనల్ని గాయపరిచాడని పగతో రగిలిపోవడం వల్ల సమస్య తీరకపోగా మరింత ఎక్కువవుతుందన్నారు. మన సద్గుణం ఎదుటివారిని ఎంతగానో ఆకట్టుకుంటుదని, మనపై ఏదైనా చెడు తలంపు ఉన్నా దాన్ని రూపుమాపి మనతో మంచిగా మెలగడానికి పూనుకుంటారని అన్నారు. కనుక ఎదుటివారి తప్పులను పెద్ద మనసుతో క్షమించడం అలవరచుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి