ఓటర్లకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని పెద్దపల్లి ఆర్డీవో బూత్ స్థాయి అధికారులకు సూచించారు. గురువారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బిఎల్వోలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బిఎల్వోలకు కేటాయించిన ఏరియాలో ఇంటింటి సర్వే నిర్వహించి, కొత్త ఓటర్లను నమోదు చేయాలన్నారు. మరణించిన వారి వివరాలను తొలగించాలని, అవసరమైన సవరణలు చేసి, కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఆయన కోరారు. అనంతరం తాహసిల్దార్ పుల్లూరు జగదీశ్వరరావు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు బిఎల్వోలు పనిచేయాలని, పారదర్శకంగా ఓటర్ల నమోదును చేపట్టాలన్నారు. ఇందులో ఈర్ల సమ్మయ్య మాస్టర్ ట్రైనర్ గా వ్యవహరించారు. బిఎల్వోల విధులు, బాధ్యతలు, ఫారం 6, 6ఎ, 7, 8 లతో పాటు ఇతర పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్ ఈర్ల సమ్మయ్య బిఎల్ఓలకు అవగాహన కల్పించారు. బిఎల్వోల చేత రోల్ ప్లే చేయించారు. కార్యక్రమంలో తహసిల్దార్ జగదీశ్వరరావు, మాస్టర్ ట్రైనర్ ఈర్ల సమ్మయ్య, నాయక్ తహసిల్దార్ జి.శంకర్, రెవెన్యూ అధికారులు వజాహత్ అలీ, నిహారిక, అన్వర్, టి.రాజయ్య, బి. వెంకటేష్, ఎండి అజీముద్దీన్, మండలంలోని బిఎల్వోలు, పలువురు పాల్గొన్నారు.
ఖచ్చితమైన సమాచారం సేకరించాలి:--పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి