బ్రతుకు నావ భారం :- సి. హెచ్. అనసూయ -హైదరాబాద్
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
=================
కడుపులో కవలలని తెలిసిబరువు
నడవలేక అవస్థ పడే తల్లిబాధ.

నాతిచరామి,మూడుముళ్ళు.
 ఏడడుగులతో, తాగి తన్నే భర్తలు.

ఆడవాళ్లు ఉద్యోగాలతో రోడ్డెక్కిపరుగులు...
ఇంటా బయట, మద్దెల మోతలు.

పుస్తకాల మోతతో, గాడిదబరువు. 
ఫీజులమోత,చదువువ్యాపారాలు. 

డిగ్రీలు,అక్కరకు రాని కాగితాలు.
నిరుద్యోగ బ్రతుకులు, భారాలు.

రైతులకు ఋణ భారాలు.
"ప్రకృతి కన్నెర్ర" పంటలు సున్న.

అప్పుల తిప్పలతో ముప్పులు.
వడ్డీ భారం తో,ఆత్మ హత్యలు.

కనికరం లేని, కసాయి పిల్లలు. 
అనాధ లైన, వృద్ధ తల్లి తండ్రులు.

చావుకోసం,ఎదురుచూస్తూ.
అనారోగ్యం తో తల్లడిల్లే,ముసలి ప్రాణాలు....

నిరుపేదల ,బండెడు బాధలు. 
మారని గీతలు,గుండె గాయాలు.

కానరానిదేవుడు,కనికరించే
దెప్పుడో....
కష్టాలకడలి, నావతీరంచేరేదెప్పుడో.......



కామెంట్‌లు