విలక్షణ నటుడు...విధివంచితుడు...కోట..?:- కవిరత్నసాహిత్యధీర సహస్రకవిభూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
1942, జూలై 10 : జననం.
2025 జూలై 13 : మరణం.

తొలి చిత్రం...
ప్రాణం ఖరీదు...చిరంజీవితో...
చివరి చిత్రం...
హరిహర వీరమల్లు...పవణ్ కళ్యాణ్ తో...

ఒకనాటి..
స్టేట్ బ్యాంక్...చిరుఉద్యోగి
రంగస్థలం రత్న దీపం...కోట
తెలుగు...తమిళ...హింది...
కన్నడ...మలయాళ భాషల్లో...
750 చిత్రాల్లో...విభిన్న పాత్రల్లో...
వెండితెర మీద ఓ
వెలుగు వెలిగిన విలక్షణనటుడు...కోట

"ప్రతిఘటన" చిత్రంలో
"గుడిశెల కాశయ్య" గా
తెలంగాణ యాసతో
"విలక్షణమైన విలన్" పాత్రలో
ఆబాల గోపాలాన్ని అలరించి...
"అహనా పెళ్ళి అంట" చిత్రంలో
"పిసనారి" పాత్రలో
ప్రేక్షకులను కడుపుబ్బా
నవ్వించిన "హాస్య నటచక్రవర్తి"...కోట

1999 లో భాజాపా ప్రజాప్రతినిధిగా
విజయవాడ తూర్పు నియోజకవర్గ 
ఎమ్మెల్యేగా రాజకీయ రంగప్రవేశం చేసి...

తన అసాధారణ అద్వితీయ
నవరస నటనకు ప్రతిభకు గుర్తింపుగా
రాష్ట్రప్రభుత్వంచే "9 నందిఅవార్డులు"...

నాటి దిగవంత మాజీ రాష్టప్రతి
ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా
2015 లో భారత ప్రభుత్వంచే
"పద్మశ్రీ" పురస్కారం అందుకున్న
ప్రతిభాశాలి...కోట శ్రీనివాసరావు...

ఔను...కోట ఒక విలక్షణ నటుడే...
కాదుకాదు విధివంచితుడు కూడా...

మానసిక వ్యాధితో భర్తనే గుర్తు పట్టలేని
భార్య రుక్మిణితో బ్రతుకంతా భాధల్ని భరిస్తూ...ముళ్ళదారిలో పయనిస్తూ...
30 సంవత్సరాలు కాపురం చేసిన
ఒక "బంగారు భర్త"...కోట శ్రీనివాసరావు

చెట్టంత కొడుకు...కారు
ఏక్సిడెంట్ లో కన్ను మూసినా...
కన్నకూతురును...కారు
యాక్సిడెంట్లో కాలుకోల్పోయి
దివ్యాంగురాలైనా...దిగులు చెందక
బ్రతుకు చితికినా ఆ భగవంతున్ని
నిందించని సహనశీలి శాంతమూర్తి...కోట

గుండె పగిలినా...
అగ్నిపర్వతమై రగిలినా...
కన్నీటి వరదలు ముంచెత్తినా...
తన హాస్యనటనతో...ప్రేక్షకులను 
కడుపుబ్బా నవ్వించి...నటనే తన
ఊపిరిగా జీవించిన "చార్లీచాప్లిన్"...కోట

తెరపైన...
కోట నట జీవితం
విలాసవంతమైన
విందు భోజనమే...
కానీ తెరవెనుక వారి
నిండు నిజజీవితం
నిరాశా నిలయమే...
విధి వంచితమే...
విష పూరితమే....
విషాద భరితమే..
కన్నీటి సంద్రమే....
ఆరని అగ్నిగుండమే...
జీవితమంతా అడుగడుగున
రాళ్ళురప్పలే...ముండ్లతుప్పలే...
సునామీలే... సుడిగుండాలే...
సుఖశాంతులు...శూన్యమే...
కోట బ్రతుకుబాట...కాదు పూలతోట..!

( కోటగారి ఆత్మకు శాంతి కలగాలని
ప్రార్థిస్తూ అర్పిస్తున్న అక్షర నివాళి...)




కామెంట్‌లు