పాముల్ని తయారు చేస్తున్నది విషం కోసమా భయపెట్టడం కోసం.!!
చేపల్ని తయారు చేస్తున్నది ఆకలి కోసమా రుచి కోసం
కోయిల కోస్తున్నది తోడు కోసమా ఆకలి కోసం.
అద్దాలు తయారు చేస్తున్నది అందం కోసమా వివక్షను సృష్టించడం కోసం.
కత్తులు తయారు చేస్తున్నది మాంసం కోసమా హత్యల కోసం.
పురుగులు పట్టును తయారు చేస్తలేవు చెట్టును తింటున్నవీ.
ఏటి గట్టున పిట్టలు లేవు ఎండిపోయిన చేపలు ఉన్నాయి.
మట్టిని తయారు చేసింది ఎరువు కోసమా ఏరువాక కోసం
వర్షం కురవాల్సింది మేఘాలు ఆలు మొగలయ్యాయి.
ఆదివాసుల శ్రమ ఆదియోగి ధరించని వస్త్రం పూర్వకాలం కాదు పురాణ కాలం.
వనాలు లేని చోట జనాలు ఉన్నారు జనాలు ఉన్నచోట వనాలు లేవు.
నీరు నిప్పు చెప్పుడు మాటలు వినవు
రాగి బంగారం కలిపినా కలువవు. పాదరసం పరవశమా విషం.
పంజరం ప్రేమ ఆకాశాన్ని భూమిని ఊయల లా పైకి కిందికి ఊపుతాయి.
కన్నెపిల్ల వెన్నెల లా చల్లగా ఉంటుంది. కాంతా కాంతిలా వేడిగుంటుంది.
అభినయం అభిమానం ఆత్మది అంతరాత్మది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి