కృతఘ్నత:- - జయా
ఆకులిచ్చి
పూవై పలకరించి
కాయలందించి
పండుతో 
నోటిని తీపి చేసి
అడుగంటా నరికినా
దవ్వనిచ్చి
పువ్వులు అల్లుకోవడానికి నారనిచ్చాక
మూలనపడేసి
మరచిపోతాం
అరటి చెట్టుని...

ఇలాగే
అన్నీ ఇచ్చాక
తిరిగి చూడక
నిర్లక్ష్యం చేసే
కొందరెప్పుడూ
ఉంటూనే ఉంటారు

ప్రేమను మరచి
ద్వేషంతో రగిలే
కృతఘ్నతా ప్రపంచం మిది


కామెంట్‌లు